ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దంపతులు విజయవాడ కనకదుర్గ అమ్మవారి సేవలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు సాదరంగా ఆహ్వానించారు. ఇటీవల ఎమ్మెల్యేగా గెలవడంతో పలు ఆలయాలను సందర్శించి మొక్కులను తీర్చుకుంటున్నారు. దానిలో భాగంగా గురువారం దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక దర్శనం తో పాటు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.