వడ్డాది ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన కీచక ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో విద్యార్థులు ఎలమంచిలిలో శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు నేతృత్వం వహించిన ఎస్ఎఫ్ఎ జిల్లా ఉపాధ్యక్షుడు అభిషేక్ మాట్లాడుతూ.. ఇటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సంఘటన జరిగిన పాఠశాల గుర్తింపును రద్దు చేయాలన్నారు.