వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ పరిధిలో రైతు సేవా కేంద్రం సిబ్బందికి శుక్రవారం యలమంచిలిలో రబీ ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనకాపల్లి జిల్లా వ్యవసాయ అధికారి బి. మోహన్ రావు మాట్లాడుతూ రబి పంట నమోదు, ఎరువుల నిల్వలు విత్తనాల పంపిణీపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి వ్యవసాయ అధికారి పి. మోహన్ రావు, ఏఈఓ దేముడు పాల్గొన్నారు.