ఆత్మహత్యకు యత్నించిన రాంబిల్లి మండలం కట్టుబోలు గ్రామానికి చెందిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై నాగేంద్ర తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో కర్రి దాలినాయుడు (58) ఈనెల 3న తన ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు విశాఖ కేజిహెచ్ కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు.