మునగపాక: విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే

63చూసినవారు
మునగపాక: విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే
మునగపాక మండలం తిమ్మరాజుపేట రామాలయంలో సీతారామచంద్రుల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. గణపతి పూజ, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం తదితర కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు, అభిషేకం, అర్చనలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సత్కరించారు.

సంబంధిత పోస్ట్