కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ రద్దు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రమైన రాంబిల్లిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి దేవుడు నాయుడు మాట్లాడుతూ కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరిస్తుందని విమర్శించారు. కార్మికులపై ఆంక్షలు విధించడం తగదు అన్నారు. కార్మికుల చట్టాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం సమంజసం కాదన్నారు.