ఎస్ రాయవరం: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

71చూసినవారు
ఎస్ రాయవరం: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా హెచ్చరించారు. గురువారం ఎస్. రాయవరం పోలీస్ స్టేషను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. శాంతి భద్రతల సమస్యపై ఆరా తీశారు. గంజాయి అక్రమ రవాణా జరక్కుండా చూడాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్