యలమంచిలి ఎంపీపీ బోదేపు గోవింద్ తాడేపల్లిలో వైయస్ఆర్సీపీ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పలు కీలక అంశాలు చర్చించారు. యలమంచిలి నియోజకవర్గంలో పార్టీ భవిష్య కార్యాచరణపై చర్చించినట్లు వారు వివరించారు. మాజీ మంత్రి గుడివాడ గురునాథ రావు, పార్టీ సీనియర్ నాయకులు కరణందర్మాశ్రీ, బొడ్డేటి ప్రసాద్, నియోజక వర్గ కార్యకర్తలు పాల్గొన్నారు.