పుచేలి గ్రామంలో డస్ట్ బిన్లు పంపిణీ

51చూసినవారు
పుచేలి గ్రామంలో డస్ట్ బిన్లు పంపిణీ
అరకులోయ మండలంలోని బస్కి పంచాయతీ పరిధి పుచేలి గ్రామంలో శుక్రవారం దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టి ఇంటింటికి డస్ట్ బిన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ రమేష్ పాల్గొని డస్ట్ బిన్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ డస్ట్ బిన్లలో తడిపొడి చెత్తను వేరుచేసి సంబంధిత పంచాయితీ కార్మికులకు అందజేసి క్లీన్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దేవా తదితరులున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్