దేశానికి మంచి పౌరులను అందించేది ఉపాధ్యాయుడే

53చూసినవారు
దేశానికి మంచి పౌరులను అందించేది ఉపాధ్యాయుడే
ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనదని అరకులోయ భారతీయ స్టేట్ బ్యాంక్ సిబ్బంది అరుణ్ కుమార్ క్రాంతికుమార్ అన్నారు. గురువారం ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అరకులోయలోని మండల విద్యాశాఖ అధికారులు త్రినాథరావు భారతిరత్నంను దుస్సాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అరుణ్ కుమార్ మాట్లాడుతూ గురువు దీవెన వల్లనే ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. దేశానికి మంచి పౌరులను అందించేది కేవలం ఉపాధ్యాయుడే అన్నారు.

సంబంధిత పోస్ట్