జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థినే గెలిపించాలని సిపిఎం మండల కార్యదర్శి పోతురాజు కోరారు. శనివారం డుంబ్రిగుడ మండలంలోని కితలంగి గ్రామంలో ప్రచారం నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. గిరిజనుల పొడు భూములకు రక్షణ ఉండాలంటే ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో సిపిఎం పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థినే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.