ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి

66చూసినవారు
ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి
బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక పందిళ్లు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా పోలీస్ శాఖ అనుమతులు తీసుకోవాలని బుచ్చయ్యపేట ఎస్ఐ డి. ఈశ్వరరావు పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో అల్లర్లకు ఘర్షణలకు తావు లేకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్