మన సముద్రం, మన వాతావరణం కోసం కృషి చేయాలని యాక్షన్ ఎయిడ్ సంస్థ ఫెలోషిప్ ప్రతినిధి కృష్ణ కుమారి కోరారు. శనివారం ఫిషింగ్ హార్బర్ చేరువలో ఉన్న జాలారిపేటలో ప్రపంచ సముద్రాల దినోత్సవం కార్యక్రమం సందర్భంగా మత్స్యకారుల సాధికారత, శీతోష్ణస్థితి న్యాయం బలపరచడం అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏడాది పొడవునా ప్రపంచ వ్యాప్తంగా మహా సముద్రాలను కాపాడుకోవాల్సిన రోజులేనని గుర్తు చేశారు.