కూలిన ఇంటిగోడ.. మహిళకు గాయాలు

80చూసినవారు
కూలిన ఇంటిగోడ.. మహిళకు గాయాలు
తుఫాన్ ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని పాత జోగుంపేట గ్రామానికి చెందిన వాసం త్రిమూర్తులమ్మకు చెందిన తాటాకు ఇల్లు గోడ కూలిపోయింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో త్రిమూర్తులమ్మ గాయపడింది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. గోడ కూలిపోవడంతో ఇంట్లో గృహోపకరణాలు దెబ్బతిన్నాయి. తనను ఆదుకోవాలని బాధితురాలు వేడుకుంటుంది.

సంబంధిత పోస్ట్