ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీం ఆధ్వర్యంలో నాతవరం మండలం, చెర్లోపాలెం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ ఎమ్. రాజేష్ నాయుడు, డాక్టర్ ఎస్. ప్రసన్న పాల్గొని 140 మందికి వైద్య సేవలు అందించి ఉచిత మందులు పంపిణీ చేసి రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జోనల్ సూపర్వైజర్ డి. రమణ మాట్లాడుతూ హెచ్ఐవి సుఖ వ్యాధులు మరియు టీబీ వ్యాధుల పైన అవగాహన కల్పించారు. అలాగే అవగాహన కల్పించుటకు లింక్ వర్కర్స్ ఆధ్వర్యంలో స్టాల్ యాక్టివిటీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వైసిపి నాయకులు ఎం రమణ, గ్రామ సెక్రెటరీ ఎల్ శేషు, డిస్టిక్ రిసోర్స్ పర్సన్ గోవింద్, గ్రామ వైద్య సిబ్బంది ఎం ఎం ఎల్ హెచ్ పి, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు మరియు లింక్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.