కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అంగన్వాడీల నిర్వహణపై ఆలోచన చేయాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు సెలవులు ప్రకటించారని, అంగన్వాడీ కేంద్రాలను విస్మరించడం ఏంటని పలువురు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలును కేంద్రాలకు పంపాలంటే నే భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలకు వైరస్ సోకితే ప్రమాదమని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి తక్షణమే సెలవులు ప్రకటించాలని వారంతా కోరుతున్నారు.