నాతవరం మండలం గాంధీనగరం లో పంచాయతీ కార్యదర్శి వై. మీనాక్షి కనకలక్ష్మి పర్యవేక్షణలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా శనివారం గ్రామంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేసినట్లు సర్పంచ్ పాతాళ అప్పారావు తెలిపారు. మురికి కాలువలు శుభ్రం చేయడంతో పాటు చెత్తాచెదారం తొలగించడం జరిగిందన్నారు. పంచాయతీ కార్యదర్శి మీనాక్షి మాట్లాడుతూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో పాతాళ కుసరాజు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.