నాతవరం మండలం వై. డి. పేట పంచాయతీ, మర్రిపాలెం గ్రామానికి చెందిన డయాలసిస్ రోగికి కొత్తగా పెన్షన్ మంజూరు అయింది. యాదగిరి నాగరాజు అనే బాధితుడికి కిడ్నీలు సరిగా పనిచేయక పోవడంతో డయాలసిస్ చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాధితుడు పెన్షన్ కు దరఖాస్తు చేయగా శుక్రవారం వైసిపి నాయకులు మంకు సాంబమూర్తి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబెర్ యాదగిరి నూకరాజు, ఎస్సీ కాలనీ యూత్ లీడర్ జూనియర్ జగన్ శివ, లోవరాజు, నానాజీ, వాలంటీర్లు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.