నాతవరం మండల కేంద్రమైన నాతవరంలో ఇళ్ల కొండమ్మ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందింది. అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పంచాయతీ కార్యదర్శి చినబాబు పర్యవేక్షణలో గ్రామ వాలంటీర్లు, పంచాయతీ సిబ్బంది ఆమెకు దహన క్రియలు కార్యక్రమం నిర్వహించారు. దీంతో గ్రామ వాలంటీర్లును, పంచాయతీ సిబ్బందిని పలువురు అభినందించారు.