నర్సీపట్నం నియోజకవర్గంలో బీసీ సంక్షేమం సంఘం బలోపేతానికి కృషి చేస్తానని నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నియమితులైన పోలుపర్తి శ్రీనివాసరావు తెలిపారు.ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకర్ రావు ఆధ్వర్యంలో సోమవారం విశాఖలో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పులిగా రామ్మోహన్ మురళీ ఆధ్వర్యంలో తామంతా పని చేస్తామన్నారు.