కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ

70చూసినవారు
నర్సీపట్నం ఆర్డిఓ కార్యాలయంలో ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి జయరాం మాట్లాడుతూ ఓట్ల లెక్కింపులో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు లోబడి ఏ చిన్న పొరపాట్లకు తావివ్వకుండా లెక్కింపు విజయవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సందేహాలు ఉంటే సిబ్బంది నివృత్తి చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్