వి.బి అగ్రహారం పంచాయితీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ

1081చూసినవారు
వి.బి అగ్రహారం పంచాయితీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ
నాతవరం మండలం వి. బి. అగ్రహారం పంచాయతీ, మాశయపేట గ్రామంలో ఎంపీయూపి స్కూల్ వద్ద సర్పంచ్ మలుపురెడ్డి సత్య శివ కుమార్(బాబ్జి) ఆధ్వర్యంలో గునుపూడి పి హెచ్ సి ఇంచార్జ్ డాక్టర్ రాజేష్ నాయుడు పర్యవేక్షణలో బుధవారం 45 ఏళ్ల వయసు దాటిన వారికి కరోనా నిర్మూలన కొరకు వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.

అందరూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సింహాద్రి నాయుడు, ఉప సర్పంచ్ కే. దేవతమ్మ, ఎం పి హెచ్ ఎం సత్యనారాయణ, హెచ్ ఓ నాగేశ్వరరావు, ఆశా వర్కర్ నాగరత్నం, గ్రామ వాలంటీర్ డి. సురేష్, ఏఎన్ఎం శివ కుమారి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్