వినాయక చవితి పండగపై ఆంక్షలు విధించిన రాష్ట్ర ప్రభుత్వం మీద టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాతవరం టిడిపి మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ మర్రిపాలెం లో మీడియాతో మాట్లాడుతూ. హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోవిడ్ పేరుతో హిందువులకు అతి ముఖ్యమైన వినాయక చవితి పండుగపై నిషేధం విధించడం శోచనీయమన్నారు.
రోజూ మద్యం షాపులు వద్ద ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అలాగే పాఠశాలలు కూడా ప్రారంభించారని అన్నారు. వీటన్నిటికీ లేని ఆంక్షలు వినాయక చవితి ఉత్సవాలకు ఎందుకు విధించారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఆలోచించుకొని వినాయక చవితి పండుగకు విధించిన ఆంక్షలను తొలగించి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.