నాతవరం: మండలంలోని దాన్యం సరఫరా చేసిన రైతులకు ప్రభుత్వం వెంటనే చెల్లింపులు చేపట్టాలని టిడిపి మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత డిసెంబర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం సరఫరా చేస్తే, ఇంతవరకు డబ్బులు చెల్లించకుంటే రైతుల పరిస్థితి ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. జనవరిలో కొందరు రైతులు తక్కువ ధరకు దళారులకు ధాన్యాన్ని విక్రయించగా, ఆ దళారులే రైతుల పేరిట ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేసిన ధాన్యానికి మాత్రం పేమెంట్లు అందుతున్నాయని ఆరోపించారు. ఈ అంశంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని కోరారు.