మండలంలో ఘనంగా శ్రావణ మాస పూజలు

1808చూసినవారు
మండలంలో ఘనంగా శ్రావణ మాస పూజలు
వరలక్ష్మీదేవి వ్రతాన్ని నాతవరం మండల వాసులు ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఏడాది శ్రావణ మాసం లో వచ్చే రెండవ శుక్రవారాన్ని వరలక్ష్మీదేవి వ్రతంగా జరుపుకుంటారు. మహిళలు ఈ వ్రతాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ అమ్మవారు కటాక్షాలు ఉంటే అష్ట ఐశ్వర్యాలతో పాటు సుఖ సంతోషాలతోపాటు పసుపు కుంకాలతో పిల్లాపాపలతో సుఖంగా ఉంటారని నమ్మకం. ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. అమ్మవారికి ఇష్టమైన పులిహార పరమాన్నం తో పాటు పళ్ళు పలహారాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు చేసి ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కటాక్షాన్ని పొందుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్