వివేకా హత్యకేసు.. ఉదయ్ కుమార్ రెడ్డికి నోటీసులు జారీ

72చూసినవారు
వివేకా హత్యకేసు.. ఉదయ్ కుమార్ రెడ్డికి నోటీసులు జారీ
వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన అత్యున్నత ధర్మాసనం ఉదయ్ కుమార్ రెడ్డికి నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్