అనకాపల్లి జిల్లా యలమంచిలి రైల్వే స్టేషన్ లో గురువారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి పురుగులు మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉండడంతో రైల్వే స్టేషన్ సూపర్ఇండెంట్ అతనిని యలమంచిలి ప్రభుత్వ హాస్పటల్ కి తరలించారు. అతని పరిస్తితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పటల్ కి తరలించడంతో అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.