అచ్యుతాపురం -అనకాపల్లి రహదారిలో ఇళ్లు ఇళ్ల స్థలాలు వాణిజ్య సముదాయాలు భూములు కోల్పోయిన నిర్వాసితులకు టీడీఆర్ రూపంలో కాకుండా నష్టపరిహారం నగదు రూపంలో చెల్లించాలని సిఐటియు అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ రాము డిమాండ్ చేశారు. ఈ మేరకు అచ్యుతాపురం తాహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాహసిల్దార్ శ్యామ్ ను కలిసి సిఐటియు తరపున అభిప్రాయాన్ని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. టీడీఆర్ బాండ్లు తీసుకోవడానికి అంగీకరించడం లేదన్నారు