సమాజ హితమే లక్ష్యంగా జర్నలిస్టులు పనిచేస్తున్నారని అడిషనల్ క్రైమ్ ఎస్పీ మోహన్ రావు అన్నారు. అంకితభావం దృడ సంకల్పంతో అనేక ఒత్తిడిలను ఎదుర్కొంటూ జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని అనకాపల్లిలో మోహన్ రావు శుక్రవారం ఆవిష్కరించారు. ఉత్తరాంధ్ర సమస్యలపై యూటీఎఫ్ చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు.