అనకాపల్లి జిల్లాలో ఓ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిపై టీచర్ లైంగిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అతడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసిన వీడియో నెట్టింట వైరల్ అయింది. దీంతో ఈ ఘటనపై హోం మంత్రి అనిత తాజాగా స్పందించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను గురువారం ఆదేశించారు.