అనకాపల్లి డీసీఆర్బీలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శేషగిరికి ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ అతి ఉత్కృష్ట మెడల్ లభించింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ మెడల్ లభించింది. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ తుహీన్ సిన్హా మెడల్ ను శేషగిరి కి అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు పాల్గొన్నారు.