ఉగ్రదాడులు, విపత్తులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా రెవిన్యూ అధికారి వై. సత్యన్నారాయణ రావు జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం అనకాపల్లి బైపాస్ రోడ్డులో గ్రీన్ హిల్స్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లో శేషాద్రి బ్లాక్ వద్ద జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యన్నారాయణ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ డ్రిల్ ఆసాంతం ఆసక్తికరంగా సాగింది. ఈ సందర్భంగా డి. ఆర్. ఓ. మాట్లాడారు.