అనకాపల్లి మండలం తుమ్మపాల వద్ద గల ఏలేరు కెనాల్ లో తల్లి కొడుకు మృతదేహలు లభ్యమయ్యాయి. వీరిని కసింకోట అట్టా వీధికి చెందిన అట్టా ఝాన్సీ (27)ఆమె కుమారుడు అట్టా దినేష్ కార్తీక్ (4)గా పోలీసులు గుర్తించారు. గత శుక్రవారం కుటుంబ కలహాలతో తన కొడుకు దినేష్ కార్తీక్ ను తీసుకొని ఇంటి నుండి వచ్చిన ఝాన్సీ, కొడుకు దినేష్ కార్తీక్ తో పాటు ఏలేరు కెనాల్ లో దూకేసి ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్న విషయం తెలిసిందే.