అనకాపల్లి సింహాద్రి అప్పన్న స్వామి వారి చందనోత్సవం సందర్భంగా ఈనెల 20వ తేదీ నుంచి 30 తేదీ వరకు చందనోత్సవ మాలధారణ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆలయ నిర్వహకులు మల్ల రామచందర్రావు శనివారం తెలిపారు. మే ఒకటో తేదీన అనకాపల్లి సింహాద్రి అప్పన్న స్వామి వారి దేవస్థానంలో మాల విసర్జన కార్యక్రమం ఉంటదన్నారు. కాబట్టి భక్తులు చందనోత్సవం మాలధారణ (దశావతార దీక్ష ) స్వీకరించి స్వామి వారి ఆశీస్సులతో తరించాలని కోరుతున్నారు.