అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాసేపట్లో క్షతగాత్రులను అనిత పరామర్శించనున్నారు. క్షతగాత్రులను ఇప్పటికే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుడు ధాటికి నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పేలుడు సమయంలో పరిశ్రమలో 15మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం.