వ్యవసాయ కార్మికులకు కేంద్రం సమగ్ర చట్టాన్ని చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బికేఎంయు) ఆధ్వర్యంలో దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాతవరం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా ఉద్దేశించి బికేఎంయు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు వెలుగుల అర్జునరావు, ప్రధాన కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు.