అనకాపల్లి వేల్పుల వీధి జీవీఎంసీ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం పదవ తరగతి పరీక్షల ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల అభినందన సభ జరిగింది. జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు పెతకంశెట్టి శివ సత్యనారాయణ జోసెఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలోఉత్తమ విద్యార్థులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో
విశాఖ డైరీ డైరెక్టర్ మలసాల రమణారావు, మందపాటి జానకిరామరాజు, జాజుల రమేష్, వేగి త్రినాధ్ పాల్గొన్నారు.