అనకాపల్లి జిల్లా కైలాసపట్నం బాణాసంచా కేంద్రంలో పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 8కు చేరింది. సంఘటన సమయంలో 15 మంది పనిచేస్తుండగా, ఐదుగురు స్పాట్‌లోనే, ముగ్గురు ఆసుపత్రిలో మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమం. సీఎం చంద్రబాబు ఘటనపై స్పందించి, హోంమంత్రిని సమాచారం అడిగి, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.