అనకాపల్లి: 'బాలికలకు వివాహాలు చేయవద్దు'

51చూసినవారు
అనకాపల్లి: 'బాలికలకు వివాహాలు చేయవద్దు'
అనకాపల్లి మండలంలో పలు గ్రామాల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో కిశోరీ బాలికలకు 40 రోజులు పాటు వేసవి శిక్షణ తరగతులు నిర్వహించారు. మంగళవారంతో ఈ తరగతులు ముగిశాయి. రాబాకలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో సర్పంచ్ ఎం.సన్యాసమ్మ ప్రసంగించారు. బాలికలు ఉన్నత విద్యావంతులు కావాలని ఆమె అన్నారు. తల్లిదండ్రులు అధికారులు బాలికలను వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా తీర్చిదిద్దాలన్నారు. బాలికలకు వివాహాలు చేయవద్దన్నారు.

సంబంధిత పోస్ట్