అనకాపల్లి: బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. సర్కార్ కీలక నిర్ణయం

57చూసినవారు
అనకాపల్లి: బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. సర్కార్ కీలక నిర్ణయం
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి 8 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 18 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బాణసంచా తయారీ కేంద్రాల్లో సెఫ్టీ ఆడిట్ చేయించాలని నిర్ణయం తీసుకుంది. కాగా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.15 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్