అనకాపల్లి: పేలుడు ఘటనపై మాజీ సీఎం దిగ్భ్రాంతి

62చూసినవారు
అనకాపల్లి: పేలుడు ఘటనపై మాజీ సీఎం దిగ్భ్రాంతి
అనకాపల్లి జిల్లా కోటవురట్లలో బాణా సంచా తయారీ కేంద్రంలో ప్రమాద ఘటన పట్ల మాజీ సీఎం కాంగ్రెస్‌ పార్టీ వైయస్‌.జగన్మోహన్‌రెడ్డి ఆదివారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం, మరికొందరు తీవ్రంగా గాయపడ్డం తీవ్ర విచారకరమన్నారు. మరణించినవారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన, గాయపడ్డ వారి కుటుంబాలకు తోడుగా నిలవాలని పార్టీ నాయకులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్