అనకాపల్లి: బాధితులను పరామర్శించిన హోం మంత్రి అనిత

50చూసినవారు
అనకాపల్లి: బాధితులను పరామర్శించిన హోం మంత్రి అనిత
అనకాపల్లి జిల్లా కోటవురట్లలోని కైలాసపట్నంలో జరిగిన ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించారు. స్థానికులు, అధికారుల సాయంతో క్షతగాత్రులను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి, కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. నర్సీపట్నం ఆస్పత్రికి వెళ్లి ఎంపీ శ్రీ సీఎం రమేష్ తో కలిసి అక్కడ ప్రమాద బాధితులను పరామర్శించారు. అంతకుముందే మృతి చెందిన కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్