అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదంపై హోంమంత్రి అనిత గురువారం స్పందించారు. ఎస్ఎస్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీకై ఇద్దరు కార్మికులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత జిల్లా కలెక్టర్ తో ఫోన్ మాట్లాడి సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఇద్దరు కార్మికుల మృతి పట్ల ఆమె దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.