గిరిజనులకు డోలి మోతలు తప్పడం లేదు. రావికమతం మండలం నేరేడుబంద గ్రామంలో రోడ్డు సౌకర్యం డోలీ మోతల బాధ తీరేలా లేదు. జెడ్.జోగంపేట నుంచి నేరేడుబందకు వెళ్తూ ఓ యువకుడు స్పృహ తప్పి కిందపడి, నడవలేని స్థితికి చేరుకున్నాడు. అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు 2.5 కిలోమీటర్లు డోలీ మోశారు. గ్రామంలో సుమారు 80 కుటుంబాలు నివాసముంటున్నాయని, అత్యవసర సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు.