అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కశింకోట మండలం సోమరం గ్రామంలో బుధవారం ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన రైతులతో కలిసి నేరుగా దుక్కిదున్ని విత్తనాలు నాటారు. ఖరీఫ్ సీజన్ కు రైతులు సన్నద్ధం కావాలన్నారు. కూటమి ప్రభుత్వం అవసరమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచిందని, రైతు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.