అనకాపల్లి: గ్రీన్ హిల్స్ ప్రాంతంలో మాక్ డ్రిల్

80చూసినవారు
అనకాపల్లి పట్టణం గ్రీన్ హిల్స్ ప్రాంతంలో బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాదులు అపార్ట్మెంట్ లో చొరబడి విధ్వంసం సృష్టించినప్పుడు సహాయక చర్యలు ఏ విధంగా చేపట్టాలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. అలాగే అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదాలు జరిగే సమయంలో వారిని ఏ విధంగా కాపాడాలో అవగాహన కల్పించాయి. జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

సంబంధిత పోస్ట్