అనకాపల్లి ఎంపీ క్యాంప్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.9,20,362 చెక్కులను లబ్ధిదారులకు ఎంపీ సీఎం రమేష్ సోమవారం సాయంత్రం అందజేశారు. అనంతరం సీఎం రమేష్ మాట్లాడుతూ, వివిధ అనారోగ్య సమస్యలతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి అపన్న హస్తంలాగా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తుందన్నారు. ప్రజలకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయం అందిస్తున్నారన్నారు.