అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఆదివారం సంభవించిన భారీ పేలుడు ఘటన ప్రదేశాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ జిల్లా ఉన్నత అధికారులతో కలసి ఆదివారం సాయంత్రం పరిశీలించారు. పేలుడు జరగడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. జరిగిన నష్టానికి వారు విచారణ వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం రమేష్, క్షతగాత్రులను ఆదుకుంటామని చెప్పారు.