జీవీఎంసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ధర్నాలో జీఓ నెం.36 ప్రకారం ఇంజినీరింగ్ కార్మికుల వేతనాలు పెంచాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. డీఏ బకాయిలు చెల్లింపు, రిటైర్డ్ కార్మికులకు గ్రాడ్యుటీ విడుదలను కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 15న చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.