చిన్నచిన్న గొడవలు, మాటామాటా పెరగడం, పట్టింపులు ఎక్కువవడం వల్ల కుటుంబ బంధాలు బలహీనపడుతున్నాయి. ముఖ్యంగా మహిళలు, యువతులు ఎదుర్కొనే సమస్యలు సున్నితంగా చూసి వారికి మార్గదర్శనం అవసరం. ఉద్యోగ స్థలాల్లో వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు వన్ స్టాప్ సెంటర్ ఓ ఆపద్బాంధవంగా నిలుస్తోంది. అనకాపల్లి జిల్లాలో ఇది 2023 నవంబరులో ప్రారంభమైంది.